యాదాద్రిలో కొనసాగుతన్న భక్తుల రద్దీ..ఉచిత దర్శనానికి 2 గంటల సమయం

యాదాద్రి భువనగిరి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాల (జూన్ 8) శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. శనివారం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.ప్రత్యేక దర్శనానికి కూడా 2గంటల సమయం పడుతోంది.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.